Theetu : మహిళల నెలసరి నేపథ్యంలో.. ప్రత్యేక ఆల్బమ్ ‘తీట్టు’

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:00 AM

కొన్ని సామాజిక వర్గాల్లో బహిష్టు సమయంలో స్త్రీలను ఇంటికి దూరంగా ఉంచడం ఎంతవరకు న్యాయం అనే అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని నవీన్‌ లక్ష్మణ్‌ దర్శకత్వంలో ప్రత్యేక ఆల్బమ్‌ రూపొందించారు.

Theetu : మహిళల నెలసరి నేపథ్యంలో..  ప్రత్యేక ఆల్బమ్ ‘తీట్టు’
theetu

కొన్ని సామాజిక వర్గాల్లో బహిష్టు సమయంలో స్త్రీలను ఇంటికి దూరంగా ఉంచడం ఎంతవరకు న్యాయం అనే అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని నవీన్‌ లక్ష్మణ్‌ (Naveen Lakshman) దర్శకత్వంలో ఒక ప్రత్యేక ఆల్బమ్‌ రూపొందించారు. దివంగత మాజీ నేత తందై పెరియార్ స్త్రీల పురోగతి కోసం, విముక్తి కోసం ఎంతగానో కృషి చేశారు. ఒక వ్యక్తిని మరో వ్యక్తిని కులం ఆధారంగా వేరు చేయడాన్ని అంటరానితనంగా భావిస్తే, ఒక స్త్రీని బహిష్టు సమయంలో ఇంటికి, సమాజానికి దూరంగా ఉంచడం కూడా అంటరానితనంతో సమానమని తందై పెరియార్‌ చెప్పేవారని దర్శకుడు నవీన్‌ లక్ష్మణ్ (Naveen Lakshman) గుర్తు చేస్తున్నారు.

ఈ అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఆల్బమ్‌ను రూపొందించినట్టు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దీనికి ‘తీట్టు’ (Theetu )అని పేరుపెట్టాం. మన పూర్వీకుల్లో కొందరు మేధావులు మ‌హిళ‌ల‌ బహిష్టు సమయంలో వారి శరీరంలో జరిగే మార్పులు, నీరసం అలసట వంటి వాటి నుంచి కొంతమేరకు ఉపశమనం పొందేందుకు వీలుగా విశ్రాంతి పేరుతో పీరియడ్స్‌ సమయంలో ఇంటికి దూరంగా ఉంచేసే వారు. దీన్ని కొందరు అపార్థం చేసుకుని అపవిత్రతను అంటగట్టారు.

GMBkjYub0AEWWai.jpeg


ఆ సమయంలో స్త్రీలను అంటరానివారిగా పరిగణించి ఇప్ప‌టికీ ఇంటికి దూరంగా ఉంచుతూ వ‌స్తున్నారు. యుగయుగాలుగా ఇది కొనసాగుతుంది. ఈ విషయంపై పురుషుల్లో అవగాహన కల్పించేందుకు ఆదేష్‌ బాలా (Aadesh Bala), రతి (rathi) జంటగా ఈ ఆల్బమ్‌ను రూపొందించాం. త్వరలోనే ఈ ఆల్బమ్‌ను రిలీజ్‌ చేస్తాం’ అని వెల్లడించారు.

Updated Date - Apr 26 , 2024 | 07:00 AM