Ott: తెలుగులో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన.. అదిరిపోయే హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రం

ABN , Publish Date - May 05 , 2024 | 02:52 PM

తాజాగా ఓటీటీలోకి ఓ ఆస‌క్తిక‌ర‌మైన యాక్ష‌న్ చిత్రం తెలుగులోనూ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. ఇంగ్లీష్‌లో ఈ సినిమా జ‌న‌వ‌రిలోనే ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. నాలుగు నెల‌ల త‌ర్వాత ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు.

Ott: తెలుగులో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన.. అదిరిపోయే హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రం
The Equalizer 3

తాజాగా ఓటీటీలోకి ఓ ఆస‌క్తిక‌ర‌మైన యాక్ష‌న్ చిత్రం ది ఈక్వ‌లైజ‌ర్ 3 (The Equalizer 3) తెలుగులోనూ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే రెండు భాగాలుగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం గ‌త సంవ‌త్సం చివ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంగ్లీష్‌లో జ‌న‌వ‌రిలోనే ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాలుగు నెల‌ల త‌ర్వాత ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు.

హాలీవుడ్ ఆగ్ర న‌టుడు డెంజెల్ వాషింగ్టన్ (Denzel Washington) హీరోగా వ‌చ్చిన ఈ సినిమా అంత‌కుముందు వ‌చ్చిన ఇక్వ‌లైజ‌ర్ సినిమాల‌కు సీక్వెల్‌గా 2023 సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. 1 గంట 49 నిమిషాల నిడివితో ఉన్న ఈ ది ఈక్వ‌లైజ‌ర్ 3 (The Equalizer 3) సినిమా ఆదివారం ( మే 5) నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.

2.jpg


క‌థ విష‌యానికి వ‌స్తే.. అమెరికా మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఎజెన్సీ (DIA) లో రిటైర్డ్ ఉద్యోగి అయిన రాబ‌ర్ట్ మెక్ కాల్ (Denzel Washington) ఇట‌లీలోని సిసిలీలో ఓ గ్యాంగ్ స్టన్‌ను అత‌ని ముఠాను చంపి త‌ప్పించుకునే క్ర‌మంలో తీవ్రంగా గాయ ప‌డి సృహ కోల్పోయి ఫెర్రీలో ఇట‌లీలోని ఓ మారుమూలలోని అల్టామోంటే అనే టౌన్‌కు చేరుకుంటాడు. అక్క‌డ ఓ లోక‌ల్ వ్య‌క్తి అత‌న్ని ర‌క్షించ‌గా ఓ వైద్యుడి సాయంతో కొద్ది నెలల‌ త‌ర్వాత పూర్తిగా కోలుకుంటాడు.

అయితే అదే స‌మ‌యంలో కమోరా అనే ఓ ముఠా అల్టామోంటే టౌన్‌ను కాళీ చేయాల‌ని అక్క‌డి స్థానికుల‌ను తీవ్రంగా హింసిస్తుంటారు. కాద‌న్న వారిని చంపేసి బ‌లవంతంగా ఆక్ర‌మించుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో రాబ‌ర్ట్ మెక్ కాల్ ఈ గ్యాంగ్‌కు ఎదురు తిరుగుతాడు దీంతో ముఠా హెడ్ రాబ‌ర్ట్‌ను చంప‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.. మ‌రో వైపు వీరిని ప‌ట్టుకోవ‌డానికి ఓ పోలీస్‌ అధికారిణి ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటుంది. చివ‌ర‌కు హీరో రాబ‌ర్ట్ పోలీసుల నుంచి త‌ప్పించుకుంటూ ఆ ముఠాను ఎలా మ‌ట్టుబెట్టాడనే నేప‌థ్య‌లంలో సినిమా అద్యంతం అదిరిపోయే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించారు. యాక్ష‌న్ ప్రియులు మిస్స‌వ‌కుండా త‌ప్ప‌క చూడాల్సిన సినిమా.

Updated Date - May 05 , 2024 | 02:59 PM