Met gala 2024: అంతర్జాతీయ వేదికపై అలియా హొయలు

ABN , Publish Date - May 07 , 2024 | 11:30 AM

న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024  అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో హాలీవుడ్ స్టార్స్  రెడ్ కార్పెట్ పై హొయలొలికించారు.

Met gala 2024: అంతర్జాతీయ వేదికపై అలియా హొయలు

న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024  (Met Gala 2024) అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో హాలీవుడ్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించారు.

gala  (1).jpg

ఈ ఏడాది షో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్ కాగా.. డ్రెస్ కోడ్ థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఈ షో కోసం ఆలియా భట్ (Aliabhat) చీరలో వెళ్లడం విశేషం. ప్రముఖ డిజైనర్  సభ్యచాచి డిజైన్ చేసిన స్పెషల్ శారీ ని అలియా ధరించింది. 

gala  (4).jpeg

కైలీ జెన్నర్ (Kylie Jenner) కూడా ఈ మెట్ గాలా షోకి  హాజరు అయింది ఈసారి ఆమె బాడీకాన్ ఫిట్, ఆఫ్ షౌల్డర్ నెక్‌లైన్ డ్రెస్ లో కనిపించింది. నటి జెండాయా ఈ మెట్ గాలా 2024 నైట్ కు మైసన్ మార్గీలా గౌన్ లో అలరించింది. 

gala  (3).jpeg

యాక్టర్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ సిల్హొటె, గోల్డెన్ ఫ్లోరల్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ లో ఈ మెట్ గాలా 2024 రెడ్ కార్పెట్ పై మెరిసింది.‌

gala  (2).jpeg

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియాంకా చొప్రా తన భర్త నిక్ తో కలిసి సందడి చేసింది.‌ పలువురు పాప్ సింగర్స్ నటీమణులు మోడల్స్ విభిన్నమైన ఫ్యాషన్ డ్రెస్ లతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

gala  (1).jpeg

Updated Date - May 07 , 2024 | 11:30 AM