కల్కి సినిమాతో ప్రారంభం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:09 AM

హైదరాబాద్‌లో తొలి స్టూడియోగా సారథి స్టూడియోకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలానికి తగినట్లుగా మారుతూ ఆధునాతన టెక్నాలజీతో, అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతమైన

కల్కి సినిమాతో ప్రారంభం

హైదరాబాద్‌లో తొలి స్టూడియోగా సారథి స్టూడియోకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలానికి తగినట్లుగా మారుతూ ఆధునాతన టెక్నాలజీతో, అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతమైన డాల్బీ మిక్సింగ్‌ స్టూడియోను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, సౌండ్‌ డిజైన్‌ స్టూడియోను మరో సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో చైర్మన్‌ ఎం.ఎ్‌స.ఆర్‌.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ ‘మొదట ఈ స్టూడియోను మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌గా మార్చాలని ఆలోచించాం. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకుని నేటి కాలంతో పోటీ వడే విధంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు కావాల్సిన అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాం. ప్రభా్‌సగారు నటించిన ‘కల్కీ’ సినిమాతో మా డాల్బీ మిక్సింగ్‌ థియేటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘మా స్టూడియోలో షూటింగ్‌ ప్రారంభిస్తే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో సహా తొలి కాపీని సిద్ధం చేసే సదుపాయాలన్నీ ఉన్నాయి’ అని స్టూడియో డైరెక్టర్‌ కె.వి.రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎ్‌స.రామారావు, కె.ఎల్‌.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్‌, తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ భాను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:09 AM