Bhaje Vaayu Vegam: ‘భజే వాయు వేగం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

ABN , Publish Date - May 08 , 2024 | 09:20 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు.

Bhaje Vaayu Vegam: ‘భజే వాయు వేగం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Bhaje Vaayu Vegam Movie Still

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) హీరోయిన్‌గా నటించగా.. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ (Rahul Tyson) కీలక పాత్రను పోషించారు. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఈ సినిమాకు అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. (Bhaje Vaayu Vegam Release Date)


Kartikeya.jpg

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ (Emotional Action Thriller)గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశాయి. బిగ్ స్క్రీన్స్ మీద ఈ సినిమాను చూడాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడుతోంది. గురువారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘సెట్ అయ్యిందే’ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా వదిలిన ఈ సాంగ్ ప్రోమోకు శ్రోతలను అలరించిన విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి రధన్ (Radhan) సంగీతం అందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 09:20 PM