Darshini: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. విడుదలకు రెడీ

ABN , Publish Date - May 08 , 2024 | 09:05 PM

వి4 సినీ క్రియేషన్స్ పతాకంపై వికాస్, శాంతి హీరోహీరోయిన్లుగా.. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘దర్శిని’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం మే 17న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Darshini: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. విడుదలకు రెడీ
Darshini Movie Poster

వి4 సినీ క్రియేషన్స్ పతాకంపై వికాస్, శాంతి హీరోహీరోయిన్లుగా.. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘దర్శిని’ (Darshini). ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం మే 17న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. (Darshini Censor Completed)

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ.. మా ‘దర్శిని’ చిత్రానికి సెన్సార్ వారు యూబైఏ ఇచ్చి ప్రశంసించారు. సినిమా చాలా బాగుందని కొనియాడారు. మే 17న విడుదలకు సిద్ధంగా ఉన్నాము. మా చిత్ర విడుదలకు సపోర్ట్ చేసిన దామోదర్ ప్రసాద్‌గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే ఈ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమిదని తెలిపారు. (Darshini Ready to Release)


Darshini-pic.jpg

దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ... కె ఎల్ దామోదర్ ప్రసాద్‌గారు మా గాడ్ ఫాదర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫ్యామిలీ. అందరం సొంత సినిమాగా పని చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుందని కొనియాడారు. మే 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుందని అన్నారు. హీరో వికాస్ మాట్లాడుతూ.. మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీలో చాలా కష్టాలు చూశాం. కానీ సినిమా మీద ప్యాషన్‌తో కష్టపడి పని చేశాం. సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - May 08 , 2024 | 09:05 PM