ShahRukh Khan: వారికి మాటిచ్చాను.. అందుకే ఆలస్యం.. ఇక తగ్గను!

ABN , Publish Date - May 05 , 2024 | 12:57 PM

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ గత సంవత్సరం పఠాన్, జవాన్ , డంకీ చిత్రాలతో  ప్రేక్షకులను అలరించారు. వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుని బాక్సాఫీస్‌కే బాద్‌షాగా నిలిచారు. అయితే ఇప్పటి దాకా ఆయన మరో సినిమా గురించి అప్‌డేట్‌ రాలేదు.

ShahRukh Khan: వారికి మాటిచ్చాను.. అందుకే ఆలస్యం.. ఇక తగ్గను!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ (Shahrukh Khan) గత సంవత్సరం పఠాన్(Pathan), జవాన్(jawan) , డంకీ (Dunki)చిత్రాలతో  ప్రేక్షకులను అలరించారు. వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుని బాక్సాఫీస్‌కే బాద్‌షాగా నిలిచారు. అయితే ఇప్పటి దాకా ఆయన మరో సినిమా గురించి అప్‌డేట్‌ రాలేదు. అభిమానులు మాత్రం ఆయన సినిమా కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు షారుక్‌. జూన్‌ నుంచి తన రాబోయే సినిమా చిత్రీకరణను మొదలు పెట్టునున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన తదుపరి సినిమా మొదలుపెట్టక పోవడానికి గల కారణాలను పంచుకున్నారు.

‘‘నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. గతేడాది వరుసగా మూడు సినిమాలు చేశాను. విశ్రాంతి లేకుండా పనిచేస్తూ.. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. దీంతోపాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతానని వాళ్లకు మాటిచ్చాను. అందుకే సినిమాలకు కొంత విరామం ఇచ్చి మ్యాచ్‌లని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను. నా తర్వాత సినిమా షూటింగ్‌ను జూన్‌లో మొదలు పెట్టబోతున్నాను’’ అని చెప్పారు. ఆయన, తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ‘కింగ్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - May 05 , 2024 | 01:15 PM