Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-07-21T10:25:25+05:30 IST

వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K). ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ని తాజాగా అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ చేశారు. ‘ప్రాజెక్ట్ K’ అంటే ‘కల్కీ 2898 AD’ అని టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. హాలీవుడ్ సినిమా అనే ఫీలింగ్‌ని ఇస్తోంది.

Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?
Prabhas in Kalki 2898 AD

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K). ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ని తాజాగా అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ చేశారు. ‘ప్రాజెక్ట్ K’ అంటే ‘కల్కీ 2898 AD’ (Kalki 2898 AD) అని టైటిల్‌ని రివీల్ చేశారు. అంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రభాస్ లుక్‌పై బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో అనేలా అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే గ్లింప్స్ వరకు విషయం అర్థం అయి, అవనట్లుగా బాగానే మ్యానేజ్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ (Prabhas First Look) పై వచ్చిన విమర్శకులకు బ్రేక్ వేసేలానే ఈ గ్లింప్స్ ఉంది.


ఎందుకంటే.. అసలు ఆ ఫస్ట్ లుక్‌లో ఉంది ప్రభాసేనా? తలకాయ వరకు ఎడిట్ చేసి తీసుకొచ్చి పెట్టారా? అనేలా కామెంట్స్ వినిపించగా.. అది ప్రభాసే అనేలా గ్లింప్స్‌లో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ వేషధారణ కొత్తగా అయితే ఏం లేదు. ఇది ఆల్రెడీ హాలీవుడ్‌ ఐరన్ మ్యాన్‌నే పోలి ఉంది. ఆ లుక్ సంగతి అలా ఉంటే.. గ్లింప్స్‌లో చూపించిన ఇతర కంటెంట్ మాత్రం.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా రాబోతుందనేలా హింట్ ఇవ్వడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. హాలీవుడ్ తరహా కథతో సినిమా తెరకెక్కుందనే భావనని గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్‌లో చూపించగలిగారు. (Kalki 2898 AD Glimpse Talk)

Prabhas-Kalki.jpg

‘అవెంజర్స్’ తరహాలో.. ఫస్ట్ టైమ్ ఒక భారతీయ హీరో సూపర్ హీరో అవతారంలో.. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్లుగా అయితే గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ గ్రాండియర్‌గా ఉన్నాయి. దీపికా పదుకొణె పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా చూపించారు. మొత్తంగా ఓ సైన్స్ ఫిక్షన్‌ కథని సూపర్ హీరోకి లింక్ చేస్తూ.. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ అద్భుతాన్ని చేయబోతున్నాడనేది అర్థమవుతుంది కానీ.. హాలీవుడ్‌ని కాపీ చేసినట్లు కాకుండా.. భారతీయ సూపర్ హీరో (Indian Super Hero) లాంఛింగ్‌ని ఇంకాస్త వైవిధ్యంగా ప్లాన్ చేస్తే బాగుండేదనేలా.. ఈ గ్లింప్స్ తర్వాత టాక్ వినబడుతోంది. మొత్తంగా అయితే.. ఫస్ట్ లుక్‌తో వచ్చిన నెగిటివిటీని ఈ గ్లింప్స్ పోగొట్టిందని మాత్రం చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ((Kalki 2898 AD Glimpse Report)


ఇవి కూడా చదవండి:

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

*Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు

**************************************

*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..

**************************************

*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది

**************************************

*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

**************************************

Updated Date - 2023-07-21T10:25:25+05:30 IST