Venky kudumula : మీకు తెలియని అప్‌డేట్స్‌ ఏముంటాయి.. దర్శకుడి పంచ్‌ టైమింగ్‌ అదిరింది!

ABN , First Publish Date - 2023-09-08T20:09:24+05:30 IST

హాస్యనటుడు బ్రహ్మాజీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! సినిమాల్లో లాగే సోషల్‌ మీడియాలోనూ హాస్యం పంచుతుంటారు. దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు బ్రహ్మాజీకి మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా వీరిద్దరి మధ్య ట్విట్టర్‌ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది.

Venky kudumula : మీకు తెలియని అప్‌డేట్స్‌ ఏముంటాయి.. దర్శకుడి పంచ్‌ టైమింగ్‌ అదిరింది!

హాస్యనటుడు బ్రహ్మాజీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! సినిమాల్లో లాగే సోషల్‌ మీడియాలోనూ హాస్యం పంచుతుంటారు. దర్శకుడు వెంకీ కుడుముల, నటుడు బ్రహ్మాజీకి మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా వీరిద్దరి మధ్య ట్విట్టర్‌ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. వెంకీ కామెడీ టైమింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల ఆయన నితిన్‌ - రష్మికతో ఓ సినిమా ప్రకటించారు వింకీ కుడుముల. శుక్రవారం వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఓ నెటిజన్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ కోరుతూ ట్వీట్‌ చేశాడు. ‘‘బర్త్‌డే రోజు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా. అప్‌డేట్‌ అంటూ దయచేసి నాపై ఒత్తిడి తీసుకురావొద్దు. సరైన సమయం చూసి నేనే అప్‌డేట్‌ ఇస్తా’’ అని ఆయన అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇదే సమయంలో బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి లేటెస్ట్‌ సినిమా అప్‌డేట్‌ ఇవ్వమని కోరారు. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్‌ వెంకీ.. అప్‌డేట్‌ ఇవ్వండి బ్రో’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ సర్‌.. ఎన్ని చూశారు.. ఎన్ని దాటారు.. టాలీవుడ్‌లో మీకు తెలియని అప్‌డేట్స్‌ ఏముంటాయి!!’’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసి రిప్లై ఇచ్చారు. భీష్మ చిత్రం తర్వాత నితిన్‌, రష్మిక జంటగా ఓ చిత్రాన్ని ప్రకటించారు వెంకీ. మైత్రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

Updated Date - 2023-09-08T20:09:24+05:30 IST