Prabhas - Maruthi: ప్రభాస్‌ సినిమాకు మూడు టైటిల్స్‌!

ABN , First Publish Date - 2023-04-13T11:21:54+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా (Pan india star Prabhas) మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే? ‘రాజా డీలక్స్‌’ (Raja deluxe) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది

Prabhas - Maruthi: ప్రభాస్‌ సినిమాకు మూడు టైటిల్స్‌!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా (Pan india star Prabhas) మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే? ‘రాజా డీలక్స్‌’ (Raja deluxe) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ లుక్‌ డిఫరెంట్‌గా ఉండబోతుందని సన్నిహితుల నుంచి సమాచారం. మారుతి చిత్రాల్లో ఈ సినిమా కొత్త, గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందనీ కూడా ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అంతే ప్రభాస్‌ నటిస్తున్న వరుస చిత్రాల్లో కూడా ఇది భిన్నమని చెబుతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్‌ను ఇంకా అధికారి ప్రకటించలేదు కానీ... బయట మాత్రం ‘రాజా డీలక్స్‌’కు తోడుగా మరో రెండు టైటిళ్లు అనుకున్నారట. (Prabhas-Maruthi)

దీని కోసం మారుతి ఇప్పటికే 3 పవర్‌ఫుల్‌ టైటిల్స్‌ అనుకున్నారట. టైటిల్స్‌ లోగోలతో సహా డిజైన్‌ చేసి ప్రభాస్‌ ముందు పెట్టారు. మూడూ ఇంగ్లిష్‌ టైటిళ్లే అని తెలసింది. ప్యాన్‌ ఇండియా (pan india Titles) సినిమా కావడంతో అందరికీ కనెక్ట్‌ కావాలని, అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్‌తో విడుదల చేయాలనే ఉద్దేశంతో అలా ప్లాన్‌ చేశారట మారుతి. ఆ మూడు టైటిళ్లు ప్రభాస్‌కి నచ్చాయని, అందలో ఒకటి సెలెక్ట్‌ చేసి ఓ మంచి రోజున అధికారికంగా ప్రకటిస్తారట. ‘ఆదిపురుష్‌’ (Adipurush) విడుదల తర్వాత ఈ సినిమా టైటిల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్‌ సహా ముఖ్య పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ ప్యాన్‌ ఇండియా చిత్రాలే!

Updated Date - 2023-04-13T11:22:36+05:30 IST