Pushpa 2: అడవి నుండి ఇప్పుడు ఎక్కడకి షిఫ్ట్ అయిందంటే...

ABN , First Publish Date - 2023-06-08T14:44:32+05:30 IST

'పుష్ప 2' షూటింగ్ కొన్ని రోజుల క్రితం వరకు మారేడుమిల్లి అడవుల్లో జరిగింది. ఇప్పుడు ఆ షూటింగ్ సిటీ కి షిఫ్ట్ అయింది. ఆసక్తికరం ఏంటంటే ఈ రెండు షూటింగ్స్ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ లేకపోవటం

Pushpa 2: అడవి నుండి ఇప్పుడు ఎక్కడకి షిఫ్ట్ అయిందంటే...
Allu Arjun from Pushpa

దర్శకుడు సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (AlluArjun) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అడవిలో పుష్ప కోసం తన పోలీస్ ఫోర్స్ తో వెతుకుతున్న సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఆ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. ఇప్పుడు మళ్ళీ అడవి నుండి ఆ సినిమా షూటింగ్ స్టూడియోకి షిఫ్ట్ అయింది అని తెలిసింది.

pushpa2sukumar.jpg

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ (RFC0 లో ఈ 'పుష్ప 2' సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసింది. నిన్నటి నుండి ఈ సినిమాలో విలన్స్ అయిన అనసూయ (Anasuya), సునీల్ (Sunil), రావు రమేష్ (RaoRamesh), ఇంకా మిగతా వాళ్ళ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఆసక్తికరం ఏంటంటే, ఈ షూటింగ్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొనలేదని తెలిసింది.

అల్లు అర్జున్ లేని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఇవి అయిపోగానే అల్లు అర్జున్ తో వుండే కాంబినేషన్ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు ఇవన్నీ చిత్రీకరించనున్నట్టు అప్పుడే రష్మిక (RashmikaMandanna) కూడా షూటింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా తెలిసింది. 'పుష్ప 2' కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది థియేటర్స్ లో ఒక చరిత్ర సృష్టిస్తుందని పరిశ్రమలో అనుకుంటున్నారు.

Updated Date - 2023-06-08T14:44:32+05:30 IST