Prabhas - Nayanathara : అదిరిపోయే అప్‌డేట్‌.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా..!

ABN , First Publish Date - 2023-09-23T20:12:34+05:30 IST

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై మంచు విష్ణు ‘నిజమే’ అని చెప్పలేదు కానీకాస్త సుముఖంగానే స్పందించారు. ప్రభాస్‌తోపాటు ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కూడా నటించబోతోందట.

Prabhas - Nayanathara : అదిరిపోయే అప్‌డేట్‌.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా..!

మంచు విష్ణు (Manchu vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం ‘కన్నప్ప’ (kannappa) చిత్రంలో ప్రభాస్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై మంచు విష్ణు ‘నిజమే’ అని చెప్పలేదు కానీకాస్త సుముఖంగానే స్పందించారు. స్టార్‌ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara) కూడా నటించబోతోందట. ఇదే ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న మధుబాల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను త్వరలోనే ‘కన్నప్ప’ సినిమా చేయనున్నాను. ఇందులో ప్రభాస్‌(Prabhas), నయనతార కూడా ఉన్నారు’ అని ఆ వీడియో ఇంటర్వ్యూలో మధుబాల చెప్పారు.

ప్రభాస్‌, నయనతార కలిసి ‘యోగి’ (Yogi) చిత్రంలో కనిపించారు. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మరోసారి తెరపై సందడి చేయనుంది. అయితే ఈ చిత్రంలో వీరిద్దరూ శివపార్వతులుగా కనిపించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత నుపుర్‌ సనన్‌ ఎంపిక చేశారు. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. ‘కన్నప్ప’ షూటింగ్‌ మొత్తం న్యూజిలాండ్‌లో జరపనున్నారు. ఒక షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయనున్నట్లు సినిమా పూజా కార్యక్రమం రోజే చెప్పారు. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-09-24T16:57:09+05:30 IST