Prabhas - Maruthi: ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే...

ABN , Publish Date - Dec 29 , 2023 | 02:35 PM

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటించిన తాజా చిత్రం 'సలార్‌' (Salaar) ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ వసూళ్లతో మరోసారి ప్రభాస్‌ పవరేంటో రుజువైంది. ప్రభాస్‌ని ఫ్యాన్స్  ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు.

Prabhas - Maruthi: ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే...

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) నటించిన తాజా చిత్రం 'సలార్‌' (Salaar) ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ వసూళ్లతో మరోసారి ప్రభాస్‌ పవరేంటో రుజువైంది. ప్రభాస్‌ని ఫ్యాన్స్  ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. ఇప్పుడు ఆయన మరో చిత్రంతో బిజీ కానున్నాడు. సలార్‌లో డైనోసర్‌గా కనిపించిన ఆయన మళ్లీ డార్లింగ్‌గా మారబోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్‌ సైలెంట్‌గా జరిగిపోతుంది. ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ వేశారు. అక్కడ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే సలార్‌ వేడి తగ్గాక మారుతి తన చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి ముహూర్తం కుదిరింది. సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ని ప్రకటిస్తారట. డైనోసర్‌ మనందరికీ కావాల్సిన డార్లింగ్‌గా కనిపించనుందని అంటున్నారు మేకర్స్‌.

"చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎంతో  ఎక్సయిటింగ్గా ఎదురు చూస్తున్నా.  సంక్రాంతికి ప్రభాస్ ని బ్రాండ్ న్యూ అవతార్ లో చూపించబోతున్నా" అని మారుతీ ట్వీట్ చేశారు 

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 29 , 2023 | 03:14 PM