Vishal : విశాల్‌ ఆరోపణలతో.. సెన్సార్‌ సభ్యుల అత్యవసర సమావేశం!

ABN , First Publish Date - 2023-10-03T15:54:46+05:30 IST

ముంబై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ హీరో విశాల్‌ (Vishal) చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయం తీవ్ర చర్చ జరుగుతోంది. రోజురోజుకూ బోర్డ్‌ మెంబర్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది

Vishal : విశాల్‌ ఆరోపణలతో.. సెన్సార్‌ సభ్యుల అత్యవసర సమావేశం!

ముంబై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ హీరో విశాల్‌ (Vishal) చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయం తీవ్ర చర్చ జరుగుతోంది. రోజురోజుకూ బోర్డ్‌ మెంబర్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై కేంద్రం కూడా స్పందించింది. తాజాగా ఈ విషయమై సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి (Prasoon joshi) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ముంబై మీడియా చెబుతోంది. విశాల్‌ ఆరోపణలపై చర్చించేందుకే ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు సెన్సార్‌ సభ్యులు అందరితో ప్రసూన్‌ జోషి చర్చించనున్నారట. విశాల్‌ ఆరోపణల నేపథ్యంలో త్వరలో రానున్న హిందీ, ప్రాంతీయ చిత్రాల సెన్సార్‌ పనులను బోర్డు ఇంకా క్లియర్‌ చేయలేదని సమాచారం. దీనితో ఆయా చిత్రాల విడుదల వాయిదా వేయాలని మేకర్స్‌ ఆలోచనలో పడ్డాలని టాక్‌. (Censor board)

అసలు ఏం జరిగిందంటే విశాల్‌ హీరోగా నటించిన ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ చేయడం కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్‌ గత నెల 28న ఆరోపణలు చేశారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు విశాల్‌ పేర్కొన్నారు. సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు స్ర్కీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు సంబంధిత అధికారులు ఇచ్చినట్లు విశాల్‌ ఆరోపించారు. దీనిపై కేంద్రం కూడా స్పందించి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Updated Date - 2023-10-03T16:08:42+05:30 IST