Tollywood Record: ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొట్టగలరా, సాధ్యం కాదేమో

ABN , First Publish Date - 2023-04-25T11:56:21+05:30 IST

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో నటులు వచ్చారు, ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. కానీ ఈ ఒక్క రికార్డు మాత్రం ఎక్కడా, ఎవరూ అధిగమించలేరు, ఇంతకీ ఆ రికార్డు ఏంటి అంటే...

Tollywood Record: ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొట్టగలరా, సాధ్యం కాదేమో

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహా నటులు వుద్భవించారు, అందులో ఎంతోమంది మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా, ఈనాటికీ వాళ్ళ పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడే విధంగా తమ నటనతో, జీవితాన్ని పరిశ్రమకి అంకితం చేసిన వాళ్ళు వున్నారు. దర్శకులు, నిర్మాతలు, నటులు ఒకరేమిటి ఎందరో సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినిమా పుట్టుక నాడు ఎంతో కృషి చేసిన వారే.

ఈనాడు పరిశ్రమ ఇంతలా అభివృద్ధి జరిగింది అంటే, ఆంటాడు అటువంటి మహనీయులు సినిమా రంగానికి చేసిన సేవ అటువంటింది. మొదటి తెలుగు మూకీ సినిమా చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు, మొదటి తెలుగు సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి HM Reddy), సి. పుల్లయ్య (C Pullaiah), బిఎన్ రెడ్డి (BN Reddi), చిత్తూర్ నాగయ్య, ఎల్.వి ప్రసాద్ (LV Prasad), ఘంటసాల బలరామయ్య, అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao), ఎన్టీ రామారావు (NT Rama Rao), ఎస్.వి. రంగా రావు (SV Ranga Rao), గుమ్మడి (Gummadi) ఒకారా ఇద్దరా ఎందరో వున్నారు, ఆ తరువాత వచ్చిన తరం లోకి వెళితే సూపర్ స్టార్ కృష్ణ.

superstarkrishna2.jpg

కృష్ణ (Superstar Krishna) అంతకు ముందు చెప్పిన వాళ్లందరికంటే నటనలో ఏమంత పెద్దవాడు కాదు, కానీ తనదైన మార్కు వేసుకున్నాడు సినిమా పరిశ్రమలో. తాను చిత్ర పరిశ్రమ నుండి ఎంత సంపాదించాడో, అంతకి మరింతగా పరిశ్రమ అభివృద్ధికి పెట్టాడు కృష్ణ. సినిమా సాంకేతికంగా అభివృద్ధి చెందటానికి తనవంతు కృషి తాను చేసాడు. ఒక ఈస్టమన్ కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం., డి.టి.ఎస్. సౌండ్, ఇంకో ఎంతో సాంకేతికను తీసుకురావటమే కాకుండా ఇప్పుడు వినపడే పాన్ ఇండియన్ అనే సినిమాలు అప్పట్లోనే కృష్ణ తీసి మెప్పించాడు.

అలాగే తెలుగు నటులకు వున్నన్ని అభిమాన సంఘాలు మరి ఏ భాషలోని నటులకి ఉండవేమో ! తెలుగు అభిమానులకు ఈ రికార్డులు అన్నా కూడా చాలా పెద్ద విషయం. ఒక సినిమా విడుదల అయితే చాలు, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, రూ. 50 కోట్లు, వంద కోట్లు ఇలా రికార్డులు రాసుకుంటూ వెళుతూ వుంటారు. కానీ ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాకి 100 కోట్లు అయింది, 200 కోట్లు అయింది అని ఇలా చెప్పుకుంటూ వెళుతూ వుంటారు. కానీ ఈ కోటి అన్న పదం మొదలయింది ఏ సినిమాతోనే తెలుసా? కృష్ణ నటించి, దర్శకత్వం వహించిన 'సింహాసనం' (#Simhasanam) సినిమా కోటి రూపాయలు పైన అయింది.

Superstar-krishna.jpg

అయితే కథానాయకుడిగా 30 సంవత్సరాలలో 317 చిత్రాలలో నటించిన కృష్ణ #SuperStarKrishna గారి రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఒక సినిమా తీయాలంటేనే ఒక సంవత్సరం తీసుకుంటున్న ఈ రోజుల్లో, కృష్ణ గారు ఒక సంవత్సరంలో 18 సినిమాలు చేసి, విడుదల చేశారు. అతని సినిమాలు అతనికే పోటీ వచ్చేంతగా ! ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొట్టగలరా, సాధ్యమా? ఇంకెవరికీ ఈ రికార్డు బద్దలు కొట్టడం సాధ్యం కాకపోవచ్చు.

కథానాయకుడిగా 1972 సంవత్సరం లో విడుదల అయిన కృష్ణ గారి సినిమాలు.

1.మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (3-1-1972) 2. తాజమహల్ (6-4-1972) 3. అంతా మనమంచికే (19-4-1972) 4.మావూరి మొనగాళ్లు (5-5-1972) 5. గూడుపుఠాణి (26-5-1972) 6.హంతకులు దేవాంతకులు (2-6-1972) 7.కోడలు పిల్ల (29-6-1972) 8.మేనకోడలు (7-7-1972) 9.భలే మోసగాడు (12-7-21972) 10.పండంటి కాపురం (21-7-1972) 11.నిజం నిరూపిస్తా (4-8-1972) 12. ఇనస్పెక్టర్ భార్య (25-8-1972) 13. అబ్బాయిగారు అమ్మాయిగారు (31-8-1972) 14 కత్తుల రత్తయ్య (26-10-1972) 15. మా ఇంటి వెలుగు (1-11-1972) 16. ప్రజానాయకుడు (10-11-1972) 17. మరపురాని తల్లి (16-11-1972) 18. ఇల్లు ఇల్లాలు (7-12-1972)

superstarkrishna8.jpg

అలాగే ఒకే సంవత్సరంలో 10 కి పైగా విడుదల అయిన సందర్భాలు కూడా వున్నాయి. ఇటువంటి రికార్డులు ఎవరూ చెరపలేరు. అలాగే ఒకే సినిమాలో ఎక్కువమంది ఆర్టిస్టులు పనిచేసిన సినిమా కూడా కృష్ణ గారే చేశారు. అదే 'అల్లూరి సీతారామరాజు'. ఇందులో ఉన్నంత మంది ఆర్టిస్టులు మరి ఏ సినిమాలోనూ ఇంతవరకు లేరు.

Updated Date - 2023-04-25T11:56:30+05:30 IST